మూడేళ్లుగా శృంగారం చేయలేదు.. ప్రైవేట్ జెట్ వస్తే చేస్తానంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-08-28 14:38:31.0  )
మూడేళ్లుగా శృంగారం చేయలేదు.. ప్రైవేట్ జెట్ వస్తే చేస్తానంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కానుంచి తన విచిత్రమైన వేషదారణతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రకరకాల వస్తువులతో డ్రెస్సులు డిజైన్ చేయించుకుని నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది. అమ్మడు క్రియేటివిటీకి నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరు మాత్రం ట్రోల్స్ చేస్తూ దారుణంగా కామెంట్లు పెడుతుంటారు. అయినప్పటికీ ఉర్ఫీ జావెద్ పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ నెట్టింట సంచలనం సృష్టిస్తుంటుంది.

అలాగే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఉర్ఫీ జావెద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘గత మూడేళ్లుగా నేను శృంగారంలో పాల్గొనలేదు. ఈ మూడేళ్లలో కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. ఏ వ్యక్తితో రొమాంటిక్‌గా మాట్లాడలేదు. నేను శారీరక సంబంధం పెట్టుకోకపోవడానికి కారణం కూడా ఉంది. నాకు ప్రైవేట్ జెట్ వచ్చేంత వరకు శారీరక సంబంధం పెట్టుకోకూడదని మూడేళ్ల క్రితమే ప్రమాణం చేశాను.. అది వచ్చాకే ఆ పని చేయాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ అమ్మడు చేసిన కామెంట్లు తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

(Video Link Credits to urf7i Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed