ఆ సమస్యతో ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2024-04-04 15:01:18.0  )
ఆ సమస్యతో ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అరియానా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. అనతి కాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తర్వాత నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్‌ షోకు ఎంట్రీ ఇచ్చి.. మరింత పాపులారిటీ సొంత చేసుకుంది. ఇక ప్రస్తుతం పలు షోలు చేస్తూ.. యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అరియానా.. తన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్‌లో ఎద అందాలు చూపిస్తూ, థైస్ షో చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది. ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ అమ్మడు మరింత బొద్దిగా మారి అందరినీ షాక్‌కు గురిచేసింది. అలాగే నెట్టింట ఆమె చేసే అందాల ప్రదర్శనకు ట్రోల్స్ దారుణంగా వస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోని ఈ బ్యూటీ.. మరింత రెచ్చి పోతూ స్కిన్ షో చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే అరియానా.. తాజాగా ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ పోస్ట్ ఆదారంగా అరియానా దంత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డెంటిస్ట్‌ను సంప్రదించిన అరియానా ఆ డాక్టర్‌కు థాంక్యూ చెప్తూ పోస్ట్ పెట్టింది. ఆ డాక్టర్లు తనకు ఎంతో చక్కగా వివరించారని, మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారని ఆ పోస్ట్‌లో తెలిపింది. అయితే.. ఆమెకు వచ్చిన సమస్య ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు RGV బ్యూటీ. కాగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Read More..

Subhashree Rayaguru : అందంతో చంపేస్తున్న ఓజీ బ్యూటి శుభశ్రీ రాయగురు





Advertisement

Next Story