- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్‌తో క్యారివాన్లోనే ఉండేదాన్ని.. బోర్ కొడితే నన్నే పిలిచేవారు: బిగ్ బాస్ బ్యూటీ సేన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరోను అబ్బాయిలే కాకుండా అమ్మాయిల ఫాలోయింగ్ కూడా భారీగా ఉంటుంది. అయితే తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సొట్టచెంపల బ్యూటీ అశ్విని గతంలో పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్మైల్ అంటే ఇంకా ఇష్టం. ఆయనతో గబ్బర్ సింగ్ సినిమాలో కలిసి నటించిన తర్వాతే నేను పెద్ద అభిమానిని అయ్యాను.
పవన్ సార్ సెట్స్‌లో చాలా సరదాగా ఉండేవారు. నాకు డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. అశ్విని కమాన్ అనేవారు. బోర్ కొడితే అశ్విని ఓ సాంగ్ పాడమ్మా అనేవారు. చాలా సరదాగా ఉంటారు. సార్ ఏం తింటారో అక్కడ ఉండేవారందరికీ అదే పెట్టించేవారు. అది ఆయన వ్యక్తిత్వం. నేను ఎక్కువగా క్యారీవాన్లో సార్‌తో పాటు ఉండేదాన్ని. ఎప్పుడు క్యారివాన్‌లో ఉంటే బోర్ కొడుతుందని.. సార్ నేను వెళ్లి కారులో కూర్చుంటా అని చెప్పి వెళ్లాను. తర్వాత నా కోసం దాదాపు 800 మంది ఆర్టిస్ట్‌లతో పాటు.. పవన్ కళ్యాణ్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. కో డైరెక్టర్లు వచ్చి తిట్టారు. సార్ సారీ అని చెప్పగా.. ఇట్స్ ఓకే అశ్వినీ ఫస్ట్ నువ్ చిల్ అవ్వు.. సైలెంట్‌గా ఉండు అని పవన్ సార్ కూల్ చేశారు. అప్పుడు ఆయన నాకు దేవుడిలా కనిపించారు.
అందుకే అందరూ ఆయన్ను ‘గాడ్’ అని పిలుస్తారేమో. ఇక ఆడవాళ్లకు అయితే బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అది ఎలా చూపిస్తారో మాటల్లో చెప్పలేను. పవన్‌లో సంథింగ్ ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి వెళ్లి పడుకున్నాక ఆయన నాకు కలలోకి వచ్చేవారు. సీరియస్‌గా చెప్తున్నా.. షూటింగ్ చేస్తున్నట్లుగానే డ్రీమ్స్ వచ్చేవి. నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ ఆయనను మర్చిపోలేను. అంటూ అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం అశ్విని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.