- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఒక్క ఉప్పు ప్యాకెట్ ధర రూ. 50వేలు.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు!
దిశ, సినిమా: ప్రజెంట్ బిగ్‌బాస్-8 సక్సెస్ ఫుల్‌గా ఐదు వారాలు పూర్తి చేసుకుని ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో హౌస్‌లో డబుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అంతకు ముందు హౌస్‌లో ఉన్న 8 మంది కంటెస్టెంట్‌ను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌గా, వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన 8 మంది కంటెస్టెంట్‌ను రాయల్ టీమ్‌గా డివైడ్ చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఎంతో రసవత్తరంగా సాగింది. ఇందులో ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి ఆరుగురు నామినేట్ అయినట్లు తెలుస్తుండగా.. రాయల్ క్లాన్ నుంచి ఇద్దరిని చెయ్యాలని తెలిపాడు బిగ్ బాస్. ఇక నామినేషన్ ప్రక్రియ అనంతరం.. కంటెస్టెంట్స్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఈ మేరకు ‘మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్‌లో పెట్టేయండి’ అని తెలిపాడు. అనంతరం ‘బిబి సూపర్ మార్కెట్ ఇప్పుడు ఓపెన్ కాబోతుంది’ అని అనౌన్స్ చెస్తాడు. ఇక తర్వాత సైరన్ మోగించగా.. నిఖిల్ అండ్ నబీల్ లోపలికి ఫాస్ట్‌గా వెళ్లి కావాల్సినవి తీసుకుంటారు. ఈలోపు మళ్లీ సైరన్ మోగడంతో ఆపేస్తారు. అయితే.. ఏ క్లాన్‌కి ఎంత రేషన్ ఇవ్వాలో అని డిసైడ్ చేసే అవకాశాన్ని నబీల్‌కు ఇస్తాడు బిగ్ బాస్. అప్పుడు నబీల్ ‘బిగ్ బాస్ ఒక్క సాల్డ్ ప్యాకెట్ కావాలి’ అని రిక్వెస్ట్ చేస్తాడు. అవసరం అయితే.. చికెన్ ఇచ్చేస్తాము సాల్ట్ మాత్రం ఇవ్వండి అంటారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ‘ఉప్పును పొందడానికి మీకు ఓ అవకాశం ఇస్తున్నాను. ఒక్కొ ఉప్పు ప్యాకెట్ ధర రూ. 50 వేలు. ఆ డబ్బుని విన్నర్స్ ప్రైజ్ మనీ నుంచి తీసుకోబడతాయి’ అని హౌస్ మేట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.