Bigg Boss 7 : ‘బిగ్‌బాస్ 7’ ప్రోమో రిలీజ్.. సర్‌ప్రైజ్‌లు ఉంటాయంటున్న మేకర్స్

by Hamsa |   ( Updated:2023-10-06 08:49:47.0  )
Bigg Boss 7 : ‘బిగ్‌బాస్ 7’ ప్రోమో రిలీజ్.. సర్‌ప్రైజ్‌లు ఉంటాయంటున్న మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ మా‌లో ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఇప్పటికే వచ్చిన ఆరు సీజన్‌లు పూర్తి కాగా, బిగ్‌బాస్-7 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అసలు బిగ్‌బాస్-7 సీజన్ ఉంటుందా? అనే సందేహాలు కూడా పలువురిలో నెలకొన్నాయి.

తాజాగా, బిగ్‌బాస్ టీమ్ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి అప్డేట్ లేకుండా ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో బిగ్’బాస్ లోగోను ప్రత్యేకంగా చూపించారు. దీనిపై టీమ్ స్పందిస్తూ..‘‘ బిగ్‌బాస్-7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈ సారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్ తెలిపింది. అంతేకాకుండా ఈ సీజన్’లో అభిమానులకు ఎమోషన్స్‌తో పాటు సర్‌ప్రైజ్‌లు కూడా ఉంటాయని వెల్లడించారు. ఈ సీజన్‌లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండనున్నట్లు చెప్పారు. దీంతో ఈ సారి కంటెస్టెంట్స్‌గా వచ్చేది ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట. ఈ షోకు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: హీరో ధనుష్‌, ఐశ్వర్య రజనీ కాంత్ లకు హైకోర్టులో ఊరట

Advertisement

Next Story