- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గాయం నుంచి బయటపడేందుకు రెండేళ్లు పట్టింది: Himanshi Khurana
దిశ, సినిమా : ప్రముఖ నటి హిమాన్షి ఖురానా హిందీ 'బిగ్ బాస్ 13' రియాలిటీ షో తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపింది. సల్మాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆమె రీసెంట్ ఇంటరాక్షన్‌లో తన మనసులోమాట బయటపెట్టింది. ఈ మేరకు బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టేముందు ఇంట్లో సమస్యలు వెంటాడినట్లు చెప్పిన ఆమె.. షోలో ఎదుర్కొన్న పోటీ, ఇతరత్ర సమస్యలతో మరింత ఒత్తిడికి లోనయ్యానని, బయటకొచ్చాక దాని నుంచి బయటపడేందుకు రెండేళ్లు పట్టినట్లు చెప్పింది. అలాగే తాను షోలోకి ప్రవేశించినప్పుడు 'ఇది నీ జీవితాన్ని మార్చే నిర్ణయం' అని చాలామంది చెప్పినట్లు గుర్తు చేసిన నటి.. 'కానీ, అది వాస్తవం కాదు. షోలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా. ఈ డిప్రెషన్ నా మనసును చాలా ప్రభావితం చేసింది. ఇప్పటికీ ఈవెంట్స్, షూట్‌లకు వెళ్లే ముందు భయాందోళనకు గురవుతున్నా. సహ నటుడు అఫ్సానా ఖాన్ పెళ్లిలో డ్యాన్స్ చేసినపుడు గుండెపోటుకు కూడా గురయ్యా' అంటూ ఎమోషనల్ అయింది. చివరగా రియాలిటీ షోలలో పాల్గొనడం బ్యాడ్ ఎక్స్ పీరియన్స్‌గానే భావిస్తానన్న హిమాన్షి.. ఊహించని సమస్యల నుంచి బయటపడి జీవితాన్ని ఉన్నతంగా నిర్మించుకోవడానికి చాలా సమయం పట్టినట్లు చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
గోల్డ్ కలర్ మోనోకినీలో అబ్బురపరిచిన Deepika Padukone.. నెటిజన్లు ఫిదా