'సలార్' నుంచి బిగ్ అప్‌డేట్.. ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2022-08-19 08:16:02.0  )
సలార్ నుంచి బిగ్ అప్‌డేట్.. ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా : 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీకైన ఫొటోలు, రిలీజ్ చేసిన పోస్టర్స్ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మరో బిగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు మేకర్స్. ఆగస్టు 15వ తేదీన 12:58 గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోజు ఏం అప్‌డేట్ చెప్పబోతున్నారా? అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ మొత్తం తెలంగాణలోని రామగుండంలో కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ''కళాపురం''

Advertisement

Next Story