మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ సర్‌ప్రైజ్!

by Disha Web Desk 6 |
మహేష్ బాబు-రాజమౌళి మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ సర్‌ప్రైజ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అందరి దృష్టి మహేష్-రాజమౌళి సినిమాపైనే ఉంది. ఇటీవల రాజమౌళి తండ్రి దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తైనట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు కూడా ఈ మూవీ కోసం అన్ని దేశాలు తిరుగుతూ పలు విద్యలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి కోరిక మేరకు మహేష్ పూర్తిగా సోషల్ మీడియాకు దూరమై తన లుక్స్‌ను బయటకు రాకుండా చూసుకుంటున్నాడు.

ఈ సినిమాకు నిర్మాత శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరిస్తుండగా.. ఇందులో ఓ ఇండోనేషియన్ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. చెల్సియా ఇస్లాన్.. మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందంటూ పలు వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. అయితే గత కొద్ది కాలంగా ఫ్యాన్స్ మహేష్-రాజమౌళి మూవీ నుంచి అప్డేట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మహేష్-రాజమౌళి సినిమా నుంచి బిగ్ అప్డేట్ రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. మే31న మహేష్ బాబు తండ్రి దివంగత స్టార్ హీరో కృష్ణ పుట్టిన రోజు ఈ మూవీ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నట్లు టాక్. తొందరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ గ్లింప్స్‌ను కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



Next Story

Most Viewed