Bholashankar: ఉగాది సందర్భంగా.. ‘భోళాశంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్

by Prasanna |   ( Updated:2023-03-23 05:37:38.0  )
Bholashankar: ఉగాది సందర్భంగా.. ‘భోళాశంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా : స్టార్ హీరో చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సినిమాను ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు చెబుతూ ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేశ్‌‌లు ఇద్దరూ రాయల్‌ చైర్‌లో కూర్చుని ఉండగా.. గ్రీన్‌ కుర్తా, షేడ్స్‌లో చాలా హ్యాండ్సమ్‌గా కనిపించిన చిరు వారి వెనుక నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక యంగ్ హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న మూవీలో చిరుకు చెల్లెలుగా కీర్తి నటిస్తోంది.

Advertisement

Next Story