రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్..! నటి హేమను వదిలేయండని పదేపదే ఫోన్లు చేస్తున్న ఆంధ్రా పొలిటికల్ లీడర్స్?

by Kavitha |   ( Updated:2024-05-28 03:20:46.0  )
రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్..! నటి హేమను వదిలేయండని పదేపదే ఫోన్లు చేస్తున్న ఆంధ్రా పొలిటికల్ లీడర్స్?
X

దిశ, సినిమా: బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు నోటీసులు జారీ చేసిన తర్వాత బెంగళూరు సీసీబీ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ లోని కొందరు రాజకీయ నాయకులు ఆమెను వదిలేయాలని ఫోన్లు చేసి ఒత్తిడి చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ తాలుకాలోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్, సెక్స్ దందా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. రేవ్‌ పార్టీలో తెలుగు నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారులు అంటున్నారు. దీంతో బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని హేమకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. హేమకు నోటీసులు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కొందరు బెంగళూరు సీసీబీ పోలీసులకు పదే పదే ఫోన్లు చేస్తున్నారని ఓ పోలీస్ అధికారి కన్నడ మీడియాకు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే విధంగా హేమను అరెస్ట్ చేయవద్దని, ఆమెను విచారణ చేసి వదిలేయాలని బెంగళూరు సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

కాగా బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారి రక్త నమూనాలను సేకరించి బెంగళూరు సీసీబీ పోలీసులు వాటిని ల్యాబ్ కి పంపించగా తెలుగు సినీ నటి హేమతో సహా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసు వర్గాలు తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story