- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతకు బిగ్ షాక్.. ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్.. వెకేషన్‌కు వెళ్లి పోస్ట్ పెట్టడంతో బయటపడ్డ సంచలన నిజాలు!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక సమంత చైకి దూరం కావడంతో మయోసైటీస్ వ్యాధి బారిన పడింది. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమై చికిత్స తీసుకుంది. ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుని సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అవుతోంది. ఆఫర్లు రాకపోవడంతో యాడ్స్ చేస్తూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది.
ఇక చై విషయానికొస్తే.. వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ హిట్ ఏ సినిమా పెద్దగా హిట్ కాకపోవడంతో సక్సెస్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య, చందూ మొండేటీ డైరెక్షన్‌లో దండేల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన గత కొద్ది కాలంగా యంగ్ బ్యూటీ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లండన్‌లోని ఓ హోటల్‌లో నాగచైతన్య, శోభితతో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లైంది.
కానీ వీరిద్దరు వాటిని ఖండించడం తో వాటికి చెక్ పడినట్టు అయ్యింది. తాజాగా, నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేయడంతో శోభితతో రిలేషన్‌లో ఉన్నాడన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సాయంత్ర సమయంలో సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ సింపుల్ లుక్‌లో ఉన్న ఫొటో షేర్ చేశాడు. ఇక దీనిని శోభిత లైక్ చేయడంతో డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. దీంతో చై పోస్ట్ చూసిన నెటిజన్లు నాగచైతన్య వెకేషన్‌కు శోభితను కూడా తీసుకెళ్లాడని పక్కనే ఉండొచ్చు. ఇద్దరు కలిసి ఎక్కడికో ఎంజాయ్ చేయడానికి చెక్కేశారని కామెంట్లు పెడుతున్నారు. అలాగే కొందరు నాగచైతన్య తన రెండో భార్యతో వెకేషన్‌కు వెళ్లడం సమంతకు ఇది బిగ్ షాకే అని అంటున్నారు. ఇక సామ్ ఫ్యాన్స్ మాత్రం మీ భార్యను ఎందుకు వదిలేశారు.. మళ్లీ కలిసిపోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు.