ప్రభాస్‌కు బిగ్ షాక్.. ఆ సినిమాను కొనేందుకు వెనకాడుతున్న డిస్ట్రిబ్యూటర్స్?

by sudharani |   ( Updated:2023-04-04 05:08:07.0  )
ప్రభాస్‌కు బిగ్ షాక్.. ఆ సినిమాను కొనేందుకు వెనకాడుతున్న డిస్ట్రిబ్యూటర్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా వస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన టీజర్ అనుకున్నంత క్రేజ్ రాబట్టలేకపోయింది. దీంతో నెట్టింట విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు నెలలు సమయం ఉండటంతో మూవీ అంచనాలను పెంచేందుకు దర్శక నిర్మాతలు నడుం బిగించారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై రోజు రోజుకు హైప్ తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సినిమాను ఓవర్సీస్‌లో కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అవుట్ పుట్ సరిగా రాలేదని.. అలాగే రేటు కూడా నచ్చలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే జరిగితే నిర్మాతలే ఓవర్సీస్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తారట. లేదా టీజర్‌లో మార్పలు చేశాకా డిస్ట్రిబ్యూటర్స్ సినిమా కొనేందుకు ముందుకొస్తారేమో అని ఎదురు చూస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుంది.

Also Read...

Game Changer: 'గేమ్ చేంజర్' సినిమా రీలిజ్ చేంజ్ అయ్యిందా?

Advertisement

Next Story