MAHESH BABU: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు భారీ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రిన్స్

by Anjali |
MAHESH BABU: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు భారీ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రిన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జక్కన్న భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దాదాపు ఈ చిత్రం నాలుగేళ్ల వరకు సెట్స్ షూటింగ్ జరుగుతుందట. ఇక సూపర్ ఫ్యాన్స్ అంతా ఈ ప్రాజెక్టు సెట్స్ మీదరకు ఎప్పుడొస్తుందని ఆత్రుతగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ భారీ ప్రాజెక్టును ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకురానున్నారట రాజమౌళి. శుభవార్త అందిందనుకునే సమయంలోనే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ మరో బ్యాడ్ న్యూస్ విని నిరాశ చెందుతున్నారు. అదేంటంటే.. ప్రిన్స్ మహేష్ బాబు దాదాపు 4 సంవత్సరాలు స్క్రీన్ పై కనిపించరట. పూర్తిగా సూపర్ స్టార్ ఫోకస్ అంతా జక్కన్న మూవీపైనే పెట్టనున్నారట. ఈ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియాలో సాడ్ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారోనంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Next Story