BIG BREAKING: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. తెలుగులో ఉత్తమ చిత్రం అదే!

by Shiva |   ( Updated:2024-08-16 14:23:08.0  )
BIG BREAKING: జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. తెలుగులో ఉత్తమ చిత్రం అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. వివిధ భాషల్లో అత్యంత ప్రజాధరణ పొంది, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపించిన చిత్రాలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డులను అందజేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది గాను తెలుగులో హీరో నిఖిల్ నటించిన కారీకేయ-2 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక బెస్ట్ తమిళ చిత్రంగా మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియన్ సెల్వన్-1 అవార్డును కైవసం చేసుకుంది. కన్నడ విభాగంలో హీరో యష్ నటించిన కేజీఎఫ్-2, హిందీలో గుల్ మొహర్ చిత్రాలు నేషనల్ అవార్డులను సొంత చేసుకున్నాయి. ఇక బెస్ట్ డైరెక్టర్‌గా సూరజ్ 'ఉంచాయ్' మూవీ, బెస్ట్ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ ఎంపికయ్యారు. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ - పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా), ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ - నీనా గుప్తా (ఉంచాయ్), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - శ్రీపత్ (మళ్లికాపురం), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ మేల్ - అర్జీత్ సింగ్ (కేసరియాసాంగ్ - బ్రహ్మాస్త్ర -1), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ - బాంబే జయశ్రీ , బెస్ట్ సినిమాటోగ్రఫీ - రవి వర్మ (పొన్నియన్ సెల్వన్ -1) అవార్డులను కైవసం చేసుకున్నారు.

Advertisement

Next Story