ఇండియన్ ఫిలింగా ‘project-k’ రికార్డ్.. ప్రతిష్టాత్మక స్టేజ్‌పై బిగ్‌ అప్డేట్

by Hamsa |   ( Updated:2023-07-07 05:37:12.0  )
ఇండియన్ ఫిలింగా ‘project-k’ రికార్డ్.. ప్రతిష్టాత్మక స్టేజ్‌పై బిగ్‌ అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-k’. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

తాజాగా, చిత్రయూనిట్ అభిమానులకు బిగ్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో జరిగే శాన్ డియాగో ‘కామిక్-కాన్’ వేడుకలో ‘ప్రాజెక్ట్-k’ ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌, రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. అమెరికాలో జూలై 19 నుంచి కామిక్ కాన్ కార్యక్రమం జరగనుండగా.. జూలై 20న ప్రాజెక్ట్-k టీమ్ పాల్గొనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు దక్కని గౌరవం ప్రాజెక్ట్-k సినిమాకు దక్కడం విశేషం.

దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఈవెంట్‌కు సంబంధించిన విషయాలను వెతకడం ప్రారంభించారు. ‘కామిక్ కాన్’ అనేది ఒక NGO లాంటిది. అయితే అన్ని NGO లు సేవ చేస్తే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రమోషన్స్ చేస్తుంది. చాలామందికి కామిక్స్ అంటే ఇష్టం ఉంటాయి. ఈవెంట్‌లో తమ సినిమాని ప్రమోట్ చేయడం వల్ల ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరవొచ్చునని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే పిల్లలు కూడా చాలా మంది వస్తారు. అందుకనే ప్రాజెక్-K టీమ్ కామిక్-కాన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ వరకు వెళ్లనుందని ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story