ప్రభాస్‌కు అక్కగా నటిస్తున్న Bhumika Chawla..?

by Vinod kumar |   ( Updated:2022-12-07 10:47:43.0  )
ప్రభాస్‌కు అక్కగా నటిస్తున్న Bhumika Chawla..?
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ 'పాతబడిన రాజా డీలక్స్' అనే థియేటర్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుండగా తాతా మనవళ్ల కథగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకూ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రభాస్‌ త్వరలోనే జాయిన్‌ కానున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏమిటంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. స్టార్ హీరోలకు అక్క, వదిన పాత్రలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ త్వరలో ప్రభాస్ అక్క గా నటించనుందని సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు 'ఇదేం కాంబో రా బాబు.. ప్రభాస్ హైట్‌, వెయిట్‌కు ఈ హీరోయిన్ మ్యాచ్ అవదు. ప్రభాస్ ముందు భూమిక ఉడతల ఉంటుంది' అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more:

అవార్డులంటే చాలా ఇష్టం.. అందుకోసమే కష్టపడతా: Shah Rukh khan

Advertisement

Next Story