డబ్బు విషయంలోనే కాదు..చాలా అంశాల్లో మార్పు రావాలి: భూమి

by Prasanna |   ( Updated:2022-12-27 07:39:34.0  )
డబ్బు విషయంలోనే కాదు..చాలా అంశాల్లో మార్పు రావాలి: భూమి
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య వేతన వ్యత్యాసాల గురించి భూమి పెడ్నేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా సహా నటీమణులతో కలిసి ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె..హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమల్లోనూ మహిళలకు ఒక్కో రకమైన రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే సినిమా బడ్డెట్ రూ.100-200 కోట్లకుపైగా ఉన్నప్పటికీ దాన్ని బేస్ చేసుకుని పారితోషికం ఇవ్వలేరన్న ఆమె..కేవలం డబ్బు విషయంలో మాత్రమే మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడంతో పరిస్థితి మారదని, ప్రతి అంశంలోనూ మార్పును కోరుకోవాలని సూచించింది. అలాగే హాలీవుడ్‌లోనూ స్త్రీ, పురుషుల మధ్య పారితోషికాల మధ్య తేడాలున్నట్లు కొంతమంది స్టార్ నటులు తనతో చెప్పారని, ఈ విషయంలో అండగా నిలుస్తామని భరోసా ఇచ్చినట్లు గుర్తుచేసుకుంది. 'అసమానత చాలా చోట్ల ఉంది. కానీ, కొన్నిచోట్లే పురుషులు మహిళలకు అండగా నిలుస్తున్నారు. హీరోల వేతనం తగ్గించుకుని హీరోయిన్లకు అనుకున్నదానికంటే ఎక్కువ ఇప్పించారు' అంటూ పలు విషయాలను ప్రస్తావించింది.

Advertisement

Next Story