- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రయాణమే నన్ను ఉత్తమ మహిళగా నిలబెట్టింది: భూమి
దిశ, సినిమా: సెక్సీ బ్యూటీ భూమి పెడ్నేకర్ సినిమాల మధ్య దొరికే గ్యాప్‌లో చేసే ప్రయాణాన్ని అత్యంత గొప్ప చికిత్సగా పేర్కొంది. అంతేకాదు విరామ సమయం మనిషి మానసిక శ్రేయస్సుకు దోహదం చేయడంతోపాటు మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు తోడ్పడుతుందని చెప్పింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తీవ్రమైన పని షెడ్యూల్ తర్వాత కొంత రెస్ట్ తీసుకోవడానికి కొత్త ప్రదేశానికి వెళ్తానని, కుదిరితే సినిమా షూట్‌ల మధ్య కూడా చిన్ని చిన్న ప్రయాణాలు చేస్తానని తెలిపింది. 'జర్నీ నాకొక ట్రీట్‌మెంట్ లాంటిది.
ఎందుకంటే నా ప్రియమైన వారితో కొన్ని జ్ఞాపకాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం వంటి అనేక విషయాల గురించి షేర్ చేసుకోవడం చాలా ఇష్టం. ప్రయాణించడం వల్లే నేను ఉన్నతమైన మనిషిగా ఎదిగానని భావిస్తున్నా. పర్యటనలే నా జీవితాన్ని సుసంపన్నం చేశాయి. నా హృదయాన్ని సంతృప్తిపరిచాయి. నా మనస్సును చైతన్యవంతం చేశాయి. నన్ను ఎంకరేజ్ చేశాయి. నన్ను నేను రిచార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. అందుకే ప్రతి ఒక్కరికీ ట్రిప్ చాలా అవసరమని అనుకుంటున్నా. సమయం దొరకదనే సాకు చెప్పడానికి నేనెప్పుడూ ప్రయత్నించను' అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.