మంచు ఫ్యామిలీ గొడవలపై స్పందించిన భూమ అఖిలప్రియ

by samatah |   ( Updated:2023-03-28 12:36:09.0  )
మంచు ఫ్యామిలీ గొడవలపై స్పందించిన భూమ అఖిలప్రియ
X

దిశ, వెబ్‌డెస్క్ : మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి అయినప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా మంచు బ్రదర్స్‌కు పడటం లేదు, వీరి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా మౌనిక వల్లనే అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నిజంగానే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా..ఇవన్నీ రూమర్స్‌నేమో అని కొట్టిపారేసే లోపు మంచు బ్రదర్స్ మధ్య జరుగుతున్న గొడవలను మనోజ్ వీడియో విడుదల చేశాడు. దీంతో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టు అంతా బయటపడింది.

అయితే తర్వాత దీనిపై స్పందించిన మంచు ఫ్యామిలీ అది చిన్న గొడవే అంటూ కొట్టి పారేసింది. ఇక ఇప్పటికీ ఈ గొడవలపై, రూమర్స్‌పై భూమా మౌనిక నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాగా తాజాగా, ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మౌనిక సిస్టర్, భూమా అఖిల ప్రియ మంచు ఫ్యామిలీలోని విభేదాలపై స్పందించింది. ఓ రిపోర్టర్ ఆమెను రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ.. మంచు మనోజ్, విష్ణు గొడవపై ప్రశ్న అడిగారు. దీంతో దానికి అఖిల ప్రియ స్పందిస్తూ.. ఆ గొడవ పూర్తిగా మంచు ఫ్యామిలీకి సంబంధించింది. ఈ విషయం వారిని అడిగితేనే బాగుంటుంది అంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం అఖిల ప్రియ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : నేను ఎవరినీ అడుక్కోలేదు.. సామ్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story