తక్కువ రేటుకు అమ్ముడుపోయిన Bhola Shankar

by Prasanna |   ( Updated:2023-07-30 10:09:21.0  )
తక్కువ రేటుకు అమ్ముడుపోయిన Bhola Shankar
X

దిశ, వెబ్ డెస్క్: 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా 'వేదలమ్' సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరుకు జంటగా హీరోయిన్ తమన్నా నటిస్తుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపించనుంది. ఆగష్టు 11 న విడుదలవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు 15 వేల డాలర్లు వచ్చాయి.త్వరలోనే ఏపీ, తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వనున్నాయి. ప్రస్తుతం 'భోళా శంకర్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు రాష్ట్రాల్లో కేవలం రూ. 70 కోట్ల రూపాయలకే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. చిరంజీవి సినిమా ఇంత తక్కువ రేటుకు అమ్ముడు పోవడం ఏంటని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 'Miss Shetty Mr Polishetty' సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే

Advertisement

Next Story