- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Bhola Shankar’ హిందీ వెర్షన్ రిలీజ్.. నెటిజన్ల రియాక్షన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
దిశ, వెబ్‌డెస్క్: మెగా స్టార్ చిరంజీవి, తమన్న, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. తమిళ్లో సౌపర్ హిట్ కొట్టిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. ట్రైలర్, పోస్టర్స్‌తో మూవీపై భారీ అంచనాలు వచ్చినప్పటికీ.. రిలీజైన తర్వాత బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌తో సతికలపడిపోయింది. అంతేకాకుండా కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చాయని టాక్.
ఇదిలా ఉంటే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ‘భోళా శంకర్’ సినిమాను హిందీ వెర్షన్ రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది టీం. అయితే.. తెలుగులో రిలీజ్‌కు ముందే ఈ మూవీని హిందీలోకి డబ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్‌కేడీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆగస్టు-25 నుంచి బాలీవుడ్ రిలీజ్ చేయబోతున్నట్లు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘బాలీవుడ్‌లో కూడా పరువు తీయడానికా అక్కడ రిలీజ్ చేస్తున్నారు’ అని కొందరు అంటుంటే.. ‘వాళ్లకు నాలుగు ఫైట్స్ ఉంటే చాలు సౌత్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా ఎగబడి చూసేస్తారు. అక్కడ హిట్ అయినా ఆశ్చర్యం లేదని’ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ‘భోళా శంకర్’ మూవీకి బాలీవుడ్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.