భారతీయుడు 2 మూవీ రన్ టైం తగ్గించిన మేకర్స్

by Prasanna |   ( Updated:2024-07-16 06:43:00.0  )
భారతీయుడు 2 మూవీ రన్ టైం తగ్గించిన మేకర్స్
X

దిశ, సినిమా: ఇటీవలి కాలంలో సౌత్‌లో తెరకెక్కుతున్న చిత్రాలన్నీ భారీ రన్ టైం తో థియేటర్లలో విడుదల అవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లోనే ఇలా జరుగుతుంది. రన్ టైం మూడు గంటలు ఉంటుంది. కథ బాగుంటే, ప్రేక్షకులు నిడివిని అసలు పట్టించుకోరు. కానీ, రిలీజ్ తర్వాత కంటెంట్ బాగలేకపోతే అనవసరంగా షో టైం పొడిగించారని చిత్ర యూనిట్ పై ఆడియెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

భారతీయుడు 2 విషయంలోనూ అదే జరిగింది. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. జూలై 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ, సినిమా చూసిన చాలా మంది రన్ టైం ఎక్కువైందని అంటున్నారు. శంకర్ సినిమాలు సాధారణంగా మూడు గంటల పాటు ఉంటాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకి ఇది బాగా కలిసి వచ్చింది. కానీ 'భారతీయుడు 2' విషయానికి వస్తే మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు మూడు గంటల నిడివితో విడుదలైన భారతీయుడు 2లో 20 నిమిషాల అనవసరమైన సన్నివేశాలను తొలగించారు. కట్ వెర్షన్ ఆదివారం నుండి 2 గంటల 40 నిమిషాల పాటు థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

Advertisement

Next Story

Most Viewed