Bellamkonda Sai Srinivas: ‘BSS-12’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

by Hamsa |
Bellamkonda Sai Srinivas: ‘BSS-12’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 12వ సినిమాను లెజెండ్ కోడి రామకృష్ణ గారి 75వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి #BSS12 అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీకి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు.

శివన్ రామకృష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. ఒకల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించబోతున్నారు. అయితే విడుదలైన పోస్టర్‌లో హీరో పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు. గుడిపై సూర్యకిరణాలు పడడంతో పోస్టర్ మొత్తం డివైన్ వైబ్ కనిపించింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తుపాకీ పట్టుకుని గుడిని చూస్తున్నాడు.

Advertisement

Next Story