స్కూల్ ఏజ్‌లోనే మద్యానికి బానిస.. పాతికేళ్లకే సరిపడా తాగేశానంటున్న బ్యూటీ

by Disha News Desk |
స్కూల్ ఏజ్‌లోనే మద్యానికి బానిస.. పాతికేళ్లకే సరిపడా తాగేశానంటున్న బ్యూటీ
X

దిశ, సినిమా : హాలీవుడ్ నటి, మోడల్ బెల్లా హ్యడిడ్ మద్యపానం తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. స్కూల్‌ ఏజ్‌లోనే మద్యపానాన్ని ఆస్వాదించినట్లు చెప్పిన 25 ఏళ్ల బెల్లా.. దీనివల్ల కొన్ని నెలలుగా మానసిక సమస్యలతో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తనను తాను నియంత్రించు కోలేక, మద్యపానానికి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు లేటెస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొంది.

'ఆల్కహాల్ నా మెదడు పై తీవ్ర ప్రభావం చూపిందని డాక్టర్ రుజువు చేశాడు. అప్పటి దాకా నా చేతిలో నుంచి గ్లాసును తీయడం చాలా కష్టంగా అనిపించేది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే నా జీవితానికి సరిపడా కోటా పూర్తి చేశాను. ఇకపై తాగాల్సిన అవసరం లేదని తెలిసింది' అని వెల్లడించింది. ఇక చదువుకునే వయసులోనే మద్యం మత్తు తనను చాలా ప్రభావితం చేసిందని, రాత్రిళ్లు తాగి ఉదయం 3 గంటలకు భయంకరమైన ఆందోళనతో మేల్కొనేదానన్ని వివరించింది.

https://www.instagram.com/p/CNk84cbAZCw/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CXcLA3rgU5m/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story