పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క చాలా బెటర్.. వైరలవుతోన్న RGV పోస్ట్

by Anjali |   ( Updated:2023-11-25 15:23:24.0  )
పవన్ కల్యాణ్ కంటే బర్రెలక్క చాలా బెటర్.. వైరలవుతోన్న RGV పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొని.. ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కల్యాణ్ పై దారుణంగా సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో పవన్ కల్యాణ్ పాల్గొన్న సభ ఇంత పేలవంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఆయన తాండూరు సభలో మాట్లాడేటప్పుడు మైక్ సౌండ్ కూడా సరిగ్గా రావడం లేదు. పవన్ కల్యాణ్ కానీ, నిర్వాహకులు కానీ దీనిని పట్టించుకోలేదు. ఈయనతో పోలిస్తే నిరుద్యోగుల కోసం పోరాడుతోన్న బర్రెలక్క చాలా బెటర్’’ అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story