బిగ్ బాస్ హౌజ్‌లోకి బ్యాంకాక్ పిల్ల.. వైరల్ అవుతున్న న్యూస్!

by Jakkula Samataha |
బిగ్ బాస్ హౌజ్‌లోకి బ్యాంకాక్ పిల్ల.. వైరల్ అవుతున్న న్యూస్!
X

దిశ, సినిమా : తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 8 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన రోజుకో న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈసారి హౌజ్‌లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారు అంటూ చాలా మంది ఎంతో ఆతృతగా ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్ బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్స్‌గా ఎంపికైట్లు సమాచారం. అంతే కాకుండా మరికొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి, క్రికెటర్ అర్జున్, అబ్బాస్, నటుడు రోహిత్,ఇలా పలువురు పేర్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా, దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు

కాగా, తాజాగా బిగ్ బాస్ కంటెస్ట్ంట్‌గా ఆమె వెళ్తుందంటూ మరో న్యూస్ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు అంటే బ్యాంకాక్ పిల్ల. ఈమె ఈ పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అక్కడి విశేషాలు తెలుగు వారికి షేర్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఉత్తరాంధ్రకు చెందిన ఈ తెలుగు అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. గతంలో కూడా ఈమె బిగ్ బాస్‌లోకి వెళ్తుందని చాలా వార్తలు వచచాయి. కానీ అప్పుడు వెళ్లలేదు, మరి ఇప్పుడైనా వెళ్తుందో లేక ఇది రూమర్‌నో చూడాలి అంటున్నారు పలువురు.

Advertisement

Next Story

Most Viewed