నేనూ ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నా.. కానీ బెంగళూరులో కాదు: హేమ

by GSrikanth |   ( Updated:2024-05-20 07:56:13.0  )
నేనూ ఫామ్‌హౌజ్‌లోనే ఉన్నా.. కానీ బెంగళూరులో కాదు: హేమ
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో పాటు ప్రముఖులు కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవ్ పార్టీ జరిగిన ఫామ్‌హౌజ్ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ రేవ్‌ పార్టీలో ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. తాజాగా.. దీనిపై హేమ స్పందించారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు వస్తోన్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. ‘ఆల్రేడీ ఇక్కడే హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. నా గురించి వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు’ అని హేమ స్పష్టం చేశారు. కాగా, మరోవైపు ఈ రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్‌, కోకైన్‌ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్టాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. రేవ్‌ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/ovix-tLhg00






Advertisement

Next Story

Most Viewed