రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై తెలుగు నటుడి స్పందన

by GSrikanth |
రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై తెలుగు నటుడి స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సినీ, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై స్పందిస్తుంటారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై ఎవరైనా విమర్శలు చేస్తే తనదైన రీతిలో కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెల రోజులు పూర్తయిన సందర్భంగా బండ్ల గణేష్ స్పందించారు.

ఈ మేరకు ఎక్స్‌(ట్విట్టర్‌)లో వీడియో పెట్టారు. ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేకపోయినా రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తెలంగాణను అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని నమ్మకం కలుగుతోందని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో దొరతనం లేదని.. ప్రతి ఒక్కరూ నిజాయితీగా, ఆనందంగా ఉంటున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతోందని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో పాలన మరింత అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు.

Advertisement

Next Story