నా నెక్స్ట్ మూవీ అలా ఉంటుంది.. దర్శకుడు వేణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by samatah |
నా నెక్స్ట్ మూవీ అలా ఉంటుంది.. దర్శకుడు వేణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ ఎంత మంచి సక్సెస్ అందుకుందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సత్తా చాటుతుంది.

ఒక చనిపోయిన వ్యక్తికీ సంబంధించిన దశదినకర్మ వరకు చేసే తంతు గురించి ఈ సినిమాలో పూర్తిగా చూపించారు. తెలంగాణలో ఇలాంటి సంప్రదాయాలు మరుస్తున్న తరుణంలో మరోసారి ఈ సినిమా ద్వారా గుర్తు చేశారు. ఈ కమర్షియల్ లైఫ్ లో చాలామంది కుటుంబాలు విడిపోతున్నాయి.

ఇలాంటి తరుణంలో వేణు తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పల్లె ప్రజలు ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. దీంతో ప్రతి పల్లెనా ప్రజలు ఈ మూవీని వీక్షిస్తున్నారు.

అయితే తాజాగా వేణ తన నెక్స్ట్ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ..నా నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజ్ బ్యానర్ లోనే ఉంటుందని అన్నారు. రాబోయే సినిమా కూడా ఈ విధంగానే ఫ్యూర్ కథతోనే వస్తానని తెలిపారు. కథలో బలం ఉంటే థియేటర్ల వైపు బలగాన్ని నడిపిస్తుందని తెలియజేశారు. బలగం సినిమా ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయని ముందే నమ్మానని అదే నిజమైందని తెలియజేశారు. సినిమా ఇంత రెస్పాన్స్ రావడం నాకెంతో ఆనందాన్నిస్తుందని, మళ్లీ ఇలాంటి ప్యూర్ కథతోనే మరో సినిమాతో వస్తానని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story