Srileela :ఆ సీక్రెట్ లీక్.. నోరు జారిన బాలయ్య!

by Anjali |   ( Updated:2023-06-22 14:39:41.0  )
Srileela :ఆ సీక్రెట్ లీక్.. నోరు జారిన బాలయ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో బాలకృష్ణ.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఇటీవల బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక శ్రీలీల. తాజాగా బాలకృష్ణకు చెందిన ‘బసవతారకం’ క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ హీరో కూడా హాజరయ్యారు. బాలయ్యతో పాటు పీవీ సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. ‘‘మా శ్రీలీల చాలా బిజీగా గడుపుతోంది. ఉదయాన్నే భగవంత్ కేసరి సినిమాలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చింది అని పొరపాటున బాలయ్య నోరు జారాడు. తర్వాత వెంటనే తేరుకుని రేపు మీరు చూస్తారుగా మూవీలో’’ అంటూ అంతటితో ఆపేశాడు.

Also Read..

Ram Charan: కూతురు పుట్టిన ఆనందంలో గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్!

Advertisement

Next Story