- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలకృష్ణ వల్లే ఇలా ఉన్నాను.. నటి అనితా చౌదరి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి Nandamuriయాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనితా చౌదరి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ నా జీవితంలో రెండు మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో మొదటిసారి అమెరికా వెళుతున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. అప్పుడు కస్తూరి సీరియల్ లో నా నటన మెచ్చుకొని సన్మానం చేసేందుకు ఇన్ వైట్ చేశారు అప్పుడే కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ట్రక్ మా కారును గుద్దేసింది. అప్పుడు నా కాలర్ బోన్ విరిగిపోయింది.
కాలర్ బోన్ విరిగి కుట్లు కూడా పడ్డాయి. అప్పుడు ఎలాగో కోలుకున్నాను అనుకుంటే.. కేరింత సినిమా టైమ్‌లో మరోసారి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఆ టైంలో నేను ఇక్కడ ఉండలేను. అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుందామని అనుకున్నా. కానీ నాకు ఇక్కడే బాలకృష్ణ గారు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించారు. స్వయంగా హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ హాస్పిటల్ నుంచి డాక్టర్స్‌ను తీసుకొచ్చారు. నాకు తెలిసిన ఆవిడ బాలకృష్ణకు చాలా క్లోజ్ అంతే కాదు.. ఆయనకు ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్. దాంతో తను నా గురించి ఆలోచించి బాలకృష్ణ గారికి నా యాక్సిడెంట్ గురించి చెప్పింది. అప్పుడు బాలకృష్ణ గారు వెంటనే స్పందించారు. మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నాకు ట్రీట్మెంట్ చేయించారు. నిజంగా సాయం చేయాలంటే అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు. ఆయన వల్లే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.