‘బేబి’ హీరోయిన్ వైష్ణవిపై బలగం డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ముందే జోస్యం చెప్పిన వేణు

by sudharani |   ( Updated:2023-07-15 15:37:16.0  )
‘బేబి’ హీరోయిన్ వైష్ణవిపై బలగం డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ముందే జోస్యం చెప్పిన వేణు
X

దిశ, సినిమా: ప్రముఖ కమెడియన్, బలగం డైరెక్టర్ వేణు టాలీవుడ్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘బేబి’తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన చిన్నది.. ఫస్ట్ మూవీతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇటీవల ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వైష్ణవిని ఉద్దేశిస్తూ వేణు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

‘నిజానికి ‘బలగం’ సినిమాకే వైష్ణవిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాం. కానీ అప్పుడు డేట్స్ ఖాళీగా లేవని చెప్పింది. ఇక ఈ సినిమా తర్వాత మరింత బిజీ అయిపోతుంది. ‘బేబి’ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వేణు చెప్పినట్లే ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా వైష్ణవి భవిష్యత్తు గురించి వేణు ముందే జోస్యం చెప్పాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story