రేపు సాయంత్రం 6 గంటలకు ‘బలగం’.. ఏ చానల్‌లో అంటే..

by sudharani |   ( Updated:2023-05-19 07:22:46.0  )
రేపు సాయంత్రం 6 గంటలకు ‘బలగం’.. ఏ చానల్‌లో అంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ జోడిగా నటించిన ఈ చిత్రంలో తెలంగాణ పల్లెల్లోని నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆధారణను దక్కించుకుంది. దీంతో ఓటీటీలో వచ్చినప్పటికీ థియేటర్లకు వెళ్లి సినిమా చూసేవారు. అంతే కాదు ప్రతి పల్లెటూరులోని పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేసుకుని మరీ ఈ మూవీ వీక్షించారు.

అయితే.. అప్పుడు మిస్ అయ్యాం అని ఫీల్ అవుతున్నవారందరికీ ఓ గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ సినిమా టీవీలోకి రానుంది. రేపు (ఆదివారం) స్టార్ మా చానల్‌లో సాయంత్రం 6 గంటలకు ‘బలగం’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ‘స్టార్ మా’ స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపింది. మరి, థియోటర్లలో, ఓటీటీల్లో సంచలనం సృష్టించిన ఈ మూవీ టీవీలో ఏ రేంజ్‌లో రేటింగ్ వస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Also Read..

పాట పాడిన బాలయ్య.. నెట్టింట వైరల్ (వీడియో)

Advertisement

Next Story