ఓయూ విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీగా బలగం సినిమా చూసే ఛాన్స్

by GSrikanth |   ( Updated:2023-03-31 15:28:56.0  )
ఓయూ విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీగా బలగం సినిమా చూసే ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల విడుదలై విశేష ఆదరణ పొందుతున్న ‘బలగం’ సినిమా ఏప్రిల్ 6వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శించనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ (ఐఎస్) డైరెక్టర్ ఒక సర్క్యూలర్ జారీ చేశారు. యూనివర్సిటీ వీసీ ఆదేశాల మేరకు బలగం సినిమాను ఏప్రిల్ 6న ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. క్యాంపస్ పరిధిలోని కాలేజీల విద్యార్థులు మూవీని వీక్షించడానికి తమ పేర్లను నమోదు చేయించుకుని, ఐడీ కార్డులతో రావాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనం, కుటుంబ బంధాలతో రూపొందిన ఈ సినిమాను టాలీవుడ్‌లో కమెడియన్‌, జబర్ధస్త్ ఫేమ్ వేణు తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Also Read..

మంచు మనోజ్, విష్ణుల మధ్య గొడవలు.. క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు?

Advertisement

Next Story