ఫిల్మ్ ఫెస్టివల్లో అవతార్‌తో పోటీపడుతున్న Balagam మూవీ

by Prasanna |   ( Updated:2023-09-09 03:26:32.0  )
ఫిల్మ్ ఫెస్టివల్లో అవతార్‌తో పోటీపడుతున్న Balagam మూవీ
X

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన సినిమాలలో బలగం మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతే కాకుండా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బాలగం, దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ మరియు హన్షిత నిర్మించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డును సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతో బలగం పోటీ పడుతోంది. ఈ చిత్రం 'బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్' విభాగంలో నామినేషన్ పొందింది. ఈ ఫెస్టివల్‌లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబర్ 14న క్రొయేషియాలో జరిగే ఈవెంట్ లో విజేతలను ప్రకటిస్తారు.

Advertisement

Next Story