- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘బలగం’ ఎఫెక్ట్.. పదేళ్లకు కలిసిన రెండు కుటుంబాలు
దిశ, సినిమా: చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘బలగం’. ప్రతి కుటుంబంలోని ఆప్యాయతలు, అనుబంధాలు, గిల్లికజ్జాలు, బావా మరదళ్ల సరసాలు అన్నీ ఒక్క సినిమాలో చక్కగా చూపించారు దర్శకుడు వేణు. ముఖ్యంగా ఈ మూవీ పల్లెటూరు వారిని బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి సీన్ ఎమోషనల్‌గా టచ్ చేస్తుంది. ఈ సినిమా ప్రజంట్ థియేటర్లలో ఆడుతూనే మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది.
ఇక పల్లెల్లో తెరలు వేసి మరీ ఈ సినిమాను చూస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా లక్ష్మణచందాలో స్థానిక సర్పంచ్, ఈ సినిమాను DNR ఫంక్షన్ హాల్‌లో తెరలో ఉచితంగా ప్రదర్శించారు. అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మూవీ చూసి ఒక్కటయ్యారు. వీరిద్దరి మధ్య తగాదాలు వచ్చి పదేళ్లు అవుతుందట. మొత్తానికి ఈ ‘బలగం’ మూవీ కుటుంబాలను సైతం కలిపేస్తుంది.
ఇవి కూడా చదవండి: ‘రావణాసుర’ మంచి ఎగ్జయిటింగ్ థ్రిల్లర్.. మమ్మల్ని కొత్తగా చూస్తారు