- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండోసారి తండ్రి అయిన ‘బలగం’ డైరెక్టర్ వేణు యల్దండి.. ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ వేణు యల్దండి మొదట జబర్దస్త్ షో తో బుల్లి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘బలగం’ సినిమాకు దర్శకత్వం వహించి సంచలనం సృష్టించాడు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో బలగం తెరకెక్కించాడు. ఈ ఏడాది విడుదలైన బలగం సంచలన విజయం సాధించింది. చిన్న చిన్న కారణాలతో విడిపోయిన కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి కలిసిపోయారు. అంతర్జాతీయంగా బలగం అనేక అవార్డులు కొల్లగొట్టింది. ఒక్క సినిమాతో వేణు పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది. ఇదిలా ఉంటే వేణుకు ఇదివరకు ఓ కొడుకు ఉన్నాడు.
తాజాగా, ఇప్పుడు వేణు మరోసారి తండ్రిగా ప్రమోషన్ తీసుకున్నారు. ఆయన భార్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వేణు తెలుపుతూ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఆడపిల్ల పుట్టింది. ఈ శుభవార్తను నా పెద్ద కుటుంబంతో పంచుకోవడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే కూతురిని ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.