నేను పెళ్లి చేసుకోను.. మసాలా నూరడం ఆపండి

by Prasanna |   ( Updated:2023-04-03 08:31:55.0  )
నేను పెళ్లి చేసుకోను.. మసాలా నూరడం ఆపండి
X

దిశ, సినిమా: ప్రముఖ నటి ఇషా రిఖీతో రిలేషన్‌పై రాపర్ బాద్షా ఓపెన్ అయ్యాడు. కొంతకాలంతా వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల డేటింగ్ కూడా చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నారంటూ మీడియా కోడై కూస్తుంది. దీంతో రీసెంట్‌గా సోషల్ మీడియా వేదికగా స్పందించిన బాద్షా.. ‘డియర్ మీడియా... నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. కానీ, మీరు చేస్తున్నది సరైనది కాదు. నేను పెళ్లి చేసుకోను. నా స్నేహితురాలు ఇషా రిఖీని మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఇదంతా తప్పుడు ప్రచారం, పుకార్లు మాత్రమే. ఇషాతో డేటింగ్ రిలేషన్ లేదు. మీకు కావాల్సింది మంచి మసాలా న్యూస్’ అంటూ వార్తలను కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి: పెళ్లైన హీరోను ఇష్టపడుతున్న సమంత.. ఎందుకంటే?

Advertisement

Next Story

Most Viewed