Kannappa: ‘కన్నప్ప’తో అవ్రామ్ ఎంట్రీ.. ఇంకో మూడు రోజుల్లో పోస్టర్

by sudharani |   ( Updated:2024-08-23 14:29:59.0  )
Kannappa: ‘కన్నప్ప’తో అవ్రామ్ ఎంట్రీ.. ఇంకో మూడు రోజుల్లో పోస్టర్
X

దిశ, సినిమా: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ సినమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే కన్నప్ప నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్ ఇస్తూ మూవీపై మరిన్ని అంచనాలు పంచేస్తున్నారు. ఇక సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ యూనిట్.. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

అది మరెవరో కాదు.. మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్ ‘కన్నప్ప’తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్ బాబు, విష్ణు మంచు, అవ్రామ్ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్ కానుంది. అవ్రామ్ పాత్ర, సినిమాలో లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాలి. కాగా.. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.

Advertisement

Next Story