- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బోల్డ్ ఫొటోలు చూసి షాక్ అయ్యాను: Avika Gore
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అవికాగోర్ 2022 తనకెంతో ప్రత్యేకమంటోంది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె తన కెరీర్‌తోపాటు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'కొత్త యేడాదిలో ప్రత్యేకమైన రెజొల్యూషన్స్ ఏమీ ఉండవు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ నాకు ఆ అలవాటు లేదు. ప్రతి రోజు బాగుండాలని, కొత్తగా ఉండాలని ట్రై చేస్తా. 2023 క్యాలెండర్ కోసం ఓ ఫొటో షూట్ చేశా. దానిలో నా ఫొటోలు చూసి నేనే షాక్ అయ్యా. క్యూట్‌గా, బోల్డ్‌గా చాలా బాగున్నాయి. జీవితాన్ని పెద్దగా మార్చాలనుకోను . నాకు నచ్చినట్లు ఉంటానంతే! ఇక గడిచిన ఏడాది నాకు ప్రత్యేకమైనది. ఎందుకంటే మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. కొన్ని మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాది నిర్మాణ రంగంలో అడుగుపెట్టడం కొత్త అనుభూతినిచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే డ్రెసింగ్ విషయానికొస్తే ఒకప్పటి బట్టలే కంఫర్ట్‌గా ఉండేవని, ఫ్యాషన్ పేరుతో ఇప్పుడు ఆ సౌకర్యం లేకుండా పోయిందని చెప్పింది. చివరగా 'ఆర్‌ఆర్‌ఆర్' అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందంటూ ముగించింది.
ఇవి కూడా చదవండి : అర్థరాత్రి వీడియోకాల్ చేసి నరకం చూపించాడు : Sukesh పై Jacqueline ఆరోపణలు