‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది: అవంతిక

by sudharani |   ( Updated:2023-06-01 12:51:23.0  )
‘నేను స్టూడెంట్ సర్’ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది: అవంతిక
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని జంటగా వస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్‌ ఉప్పలపాటి తెరకెక్కించిన సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై సతీష్ వర్మ నిర్మించారు. కాగా జూన్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు పంచుకుంది అవంతిక. ‘ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం కావడం చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది.

అందరికీ కనెక్ట్ అయ్యే కథ చాలా నచ్చింది. ఇందులోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయి. అందరూ చూడాల్సిన సినిమా ఇది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కథలో కీలకంగా ఉండే పాత్రలని చేయడానికే ఇష్టపడతానన్న నటి.. కథల ఎంపికలో తల్లి భాగ్యశ్రీ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరని చెప్పింది. కానీ అమ్మ సలహాలు తీసుకుంటానని.. తనకు ఏం కావాలో, ఏదైతే బావుంటుందో తనకి బాగా తెలుసంటూ వివరించింది.

Also Read..

ఆ సినిమా గురించి నన్ను ఏమీ అడగొద్దు.. సన్యా షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story