అబ్బాయిలంటే ఇష్టం లేదు.. కానీ అతను బెస్ట్.. హీరోయిన్ కామెంట్స్

by Vinod kumar |
అబ్బాయిలంటే ఇష్టం లేదు.. కానీ అతను బెస్ట్.. హీరోయిన్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘మీటర్’లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని తెలిపింది హీరోయిన్ అతుల్య రవి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా లాంచ్ కావడం హ్యాపీగా ఉందని చెప్పింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌కు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తుండగా.. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.

ఇందులో అబ్బాయిలంటే ఇష్టంలేని పాత్రలో కనిపిస్తానని, కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుందని చెప్పుకొచ్చింది అతుల్య. కోలీవుడ్ నుంచి వచ్చినా టాలీవుడ్‌లో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నానని, కిరణ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని తెలిపింది. ఇక సెట్‌లో అందరితో మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నానని, ఇంకా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాల్సిన అవసరముందని చెప్పింది.

Advertisement

Next Story