Bunny తో Atlee కాంబో ఫిక్స్.. ఐకాన్ స్టార్ దిమ్మతిరిగిపోయే Remuneration?

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-15 16:27:30.0  )
Bunny తో Atlee కాంబో ఫిక్స్.. ఐకాన్ స్టార్ దిమ్మతిరిగిపోయే Remuneration?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘జవాన్’ మూవీతో అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో అందరి దృష్టి ఈ తమిళ స్టార్ డైరెక్టర్‌పై పడింది. ‘జవాన్’ మూవీలో తన డైరెక్షన్, సినిమా రూపొందించిన తీరు, కథ, యాక్షన్ ఎపిసోడ్‌కు కరణ్ జోహర్, మహేష్, బాబు, అల్లు అర్జున్, రామ్ పోతినేని ఫిదా అయ్యారు. దీంతో అట్లీ తదుపరి చిత్రం ఎవరితో అనే చర్చ మొదలైంది. పుష్ప మూవీతో పాన్ ఇండియాలో తన సత్తా చాటారు అల్లు అర్జున్.

ఈ నేషనల్ అవార్డ్ విన్నర్‌తో అట్లీ నెక్ట్స్ మూవీ ఉంటుందని ప్రచారం ఊపందుకుంది. వీరిద్దరి కోంబోలో వివిధ భాషల్లో భారీ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి అల్లు అర్జున్ ఏకంగా రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ అంశంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్లు వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి : దేవిశ్రీ ప్రసాద్ లైవ్ పర్ఫామెన్స్.. ఫుల్ జోష్‌లో మ్యూజిక్ లవర్స్

Advertisement

Next Story