స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై దాడి.. ముఖమంతా గాయాలతో ఉన్న ఫొటోలు వైరల్!

by Hamsa |   ( Updated:2024-04-18 12:06:29.0  )
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై దాడి.. ముఖమంతా గాయాలతో ఉన్న ఫొటోలు వైరల్!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ సుపరిచితమే. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తనకంటే పదేళ్లు చిన్నవాడైన సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుని విమర్శలు ఎదుర్కొంది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. అయితే ప్రియాంక చోప్రా పెళ్లై కూతురు పుట్టినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తుంది. అలాగే తన కూతురు, భర్తతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హాలీవుడ్‌లో సీటాడెల్, బ్లఫ్ అనే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఈ క్రమంలో.. తాజాగా, ప్రియాంక చోప్రాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో దాడి చేయడం వల్ల ముఖమంతా గాయాలై రక్తం కారుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక కంటి నుంచి నీరు కారుతుండడం తో పాటుగా కందిపోయినట్టుగా ఉంది. ఆమెను ఎవరో ముఖం పగిలేటట్టు కొట్టినట్టుగా ఆ గాయాలు చూస్తే అర్థమవుతుంది. దీంతో ఈ ఫొటోలు చూసిన ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ అవి నిజమైన గాయాలు కాదని సమాచారం. ఆమె నటిస్తున్న సినిమాలోని యాక్షన్స్ సీన్స్‌కు సంబంధించిన ఫొటోలని టాక్. సినిమాలోని సీన్స్ కోసమే ఆ గాయాలను క్రియేట్ చేసినట్లు తెలియడంతో.. ఫ్యాన్స్ ఊపిరిపిల్చుకుంటున్నారు.

Advertisement

Next Story