మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌పై దాడి ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు ఏం జరిగిందంటే?

by Hamsa |   ( Updated:2024-05-06 07:21:42.0  )
మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌పై దాడి ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: తొందరలో ఎన్నికలు రాబోతుండటంతో పవన్ కల్యాణ్‌కు సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒక్కరొక్కరుగా ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్‌కు మద్దతుగా ఎన్నికలు ప్రచారం స్టార్ట్ చేశారు. పిఠాపురంతో పాటుగా మూడు చోట్ల ఆయన ప్రచారం చేసి ప్రజలతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్‌పై దాడి జరిగింది. కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో ఆయనపై కొందరు ఆకతాయిలు కూల్ డ్రింక్ బాటిల్స్ విసిరారు. ఈ దాడిలో మెగా హీరోకు తృటిలో ప్రమాదం తప్పినట్లు సమాచారం. కానీ ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త నల్ల శ్రీధర్‌కు ఓ బాటిల్ తగలడంతో కంటిపై గాయం అయింది.

దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండగా అది గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇదంతా వైసీపీ నేతల పనే అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్‌పై దాడి జరిగిందని తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఏ ప్రమాదం కాలేదు కాబట్టి ఊరుకుంటున్నాము లేదంటే వైసీపీ నేతలను వదిలిపెట్టే వాళ్లం కాదని అంటున్నారు.

Read More..

AP Politics: ఆ పార్టీ అభ్యర్థికి కలిసి వస్తున్న వైసీపీ నిర్లిప్తత..?

Advertisement

Next Story