Bhola Shankar : డైరెక్టర్‌పై దారుణమైన ట్రోల్స్‌.. ఫుల్లుగా ఆడేసుకుంటున్న నెటిజన్లు

by Hamsa |   ( Updated:2023-08-12 07:10:36.0  )
Bhola Shankar :  డైరెక్టర్‌పై దారుణమైన ట్రోల్స్‌.. ఫుల్లుగా ఆడేసుకుంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘భోళాశంకర్’. దీనిని డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కొన్ని పవన్ కల్యాణ్ ఖుషి నడుము సీన్స్‌పై ఉన్నాయంటూ ప్రేక్షకులు చిరంజీవి ముసలోడికి అవసరమా అంటూ పలు పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ వయసులో ఎలాంటి సినిమాలో తీయాలో రజినీకాంత్‌ను చూసి చిరంజీవి నేర్చుకోవాలని ప్రేక్షకులు మండిపడ్డారు. తాజాగా, ఇప్పుడు డైరెక్టర్ మెహర్ రమేష్‌పై నెట్టింట వీపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ దెబ్బతో చిరంజీవి ఒక రీమేక్ సినిమా చేయకపోవచ్చని అందుకు థాంక్స్ చెబుతూ వ్యగ్యంగా పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అంతేకాకుండా 20 ఏళ్ల క్రితం చూడాల్సిన మూవీ ఇప్పుడు తీస్తే ఇలాగే ఉంటుందని మెహర్ రమేష్ బిల్లా లాంటి సినిమాలు తీసుకోవడం బెటర్ అంటూ నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.

Also Read :

Bhola Shankar Review : ‘భోళా శంకర్’ బోల్తా..! ట్రెండింగ్‌లోకి కొరటాల..!

ఆ కారణంతో సూసైడ్ చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్?

Advertisement

Next Story