Ram Charan : రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణు స్వామి..ఎమన్నారో తెలుసా?

by samatah |   ( Updated:2023-06-21 08:27:06.0  )
Ram Charan : రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణు స్వామి..ఎమన్నారో తెలుసా?
X

దిశ, సినిమా: రామ్ చరణ్ సతీమణి ఉపాసన నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వారసురాలు పుట్టడంతో చిరు కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. తమ ఇష్టదైవం ఆంజనేయ స్వామి మంగళవారం నాడు పుట్టినందుకు చాలా సంతోషం ఉందన్నారు. ఇకపోతే తాజాగా ఉపాసన-రామ్ చరణ్ బిడ్డ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి ప్రముఖ ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి పాప జాతకం విశ్లేషించాడు. ‘చరణ్ కూతురు రాత్రి 1:49 నిమిషాలకు జన్మించింది. అంటే పునర్వసు నక్షత్రం, రెండవ పాదం మిధున రాశిలో జన్మించింది. కాబట్టి జన్మనం కోణంగి అని చెప్పవచ్చు. ఇక రామ్ చరణ్ రాశి రోహిణి, ఉపాసన రాశి కృతిక. పాపది పునర్వసు నక్షత్రం. ముగ్గురు దేవత అంశం కలిగి ఉన్నారు. దీని బట్టి చూస్తుంటే అతని కూతురిలో రాజయోగం కనిపిస్తుంది. తన వలన ఇంట్లో మరిన్ని శుభాలు జరుగుతాయి. చిరంజీవి జాతకంతో సమానంగా ఉంది. కానీ హెల్త్ పరంగా నరాలు, పంటి, చెవికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావొచ్చు’ అని తెలిపారు.

Read more :

కూతురికి ఆహీరోయిన్ పేరు కన్ఫామ్ చేసిన రామ్ చరణ్.. ఆమెపై ఉన్న పిచ్చిప్రేమతోనేనా?

ఉపాసన డెలివరీ సమయంలో అత్త సురేఖ ఎలాంటి పని చేసిందో తెలుసా?

Ram Charan - Upasana: రామ్ చరణ్ కూతురి ఫొటోస్ లీక్.. ఎవరి పోలికో తెలుసా?

Advertisement

Next Story