Ashu Reddy : డ్రగ్స్ కేసులో తెరపైకి అషురెడ్డి..అతడితో మాట్లాడిన కాల్ లిస్ట్ బట్టబయలు..!

by sudharani |   ( Updated:2023-06-24 05:09:51.0  )
Ashu Reddy : డ్రగ్స్ కేసులో తెరపైకి అషురెడ్డి..అతడితో మాట్లాడిన కాల్ లిస్ట్ బట్టబయలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నటీనటులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా డ్రగ్స్ కేసులో ‘కబాలి’ సినిమా నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడిన అతడిని విచారణ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కేపీ చౌదరి కాల్ లిస్ట్‌ను పోలీసులు డీకోడ్ చేయగా.. నటి అషు రెడ్డితో అతడు వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా గుర్తించారు పోలీసులు.

తెరపైకి అషు రెడ్డి పేరు రావడంతో.. ఈ డ్రగ్స్ అమ్మే గ్యాంగ్‌తో ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటూ సోషల్ మీడియాలో వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. ఇక పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ వార్తలపై అషురెడ్డి సైతం స్పందించింది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది. ‘కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నట్లు తనకు ఎవరితోనూ సంబంధాలు లేవు.. ఇవన్నీ తప్పుడు వార్తలు. త్వరలో వాస్తవమేమిటో వివరిస్తాను. అంతే కాకుండా తన అనుమతి లేకుండా తన ఫోన్ నెంబర్ బహిరంగంగా ప్రదర్శిస్తే అస్సలు సహించను’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. ట్విస్ట్ లు ఇస్తున్న ఈ డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Click here for more Cinema news

Advertisement

Next Story

Most Viewed