సైకిల్ మీద పత్తి అమ్ముకున్నోడు.. స్టార్ నటుడిగా ఎదిగాడు..

by Sujitha Rachapalli |
సైకిల్ మీద పత్తి అమ్ముకున్నోడు.. స్టార్ నటుడిగా ఎదిగాడు..
X

దిశ, సినిమా: అశోక్ పాఠక్.. బీహార్ కు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొన్న ఆయన.. ఫ్యామిలీతో కలిసి సొంతూరు నుంచి మామగారి ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆయనకు సపోర్ట్ గా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సైకిల్ పై పత్తి అమ్మేవాడని తెలుస్తుంది. అలాంటి వ్యక్తి కాలేజ్ ఫెస్టివల్ జరుగుతున్న టైంలో కళ మీద అభిమానం ఏర్పరుచుకున్నాడు. స్టేజ్ మీద పలు నాటకాలు చేస్తూ.. నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే తెరపై కనిపించాలని పలు ప్రయత్నాలు చేశాడు. పలు ప్రాజెక్ట్స్ కు ఆడిషన్స్ ఇచ్చాడు.

మొత్తానికి ప్రైమ్ ఒరిజినల్స్ ' పంచాయత్ ' సిరీస్ లో క్యారెక్టర్ కొట్టేశాడు. నిజానికి ముందుగా తను సెలెక్ట్ కాలేదని కాల్ వచ్చింది.. కానీ తర్వాత ఆ క్యారెక్టర్ తనే చేయాల్సి వచ్చింది. అనంతరం సిరీస్ లో నటించి వినోద్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసిన ఆయన జర్నీ నిజంగానే సూపర్ ఇన్ స్పిరేషనల్ అని పొగుడుతున్నారు అభిమానులు. ఒక పల్లెటూరుకు చెందిన పత్తి అమ్ముకునే వ్యక్తి.. ఇంటర్నేషనల్ ఫేం పొందడంపై గర్వంగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed