పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి చిత్రం

by Hamsa |   ( Updated:2023-03-03 09:33:11.0  )
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి చిత్రం
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ఈ పేరుకి ఇప్పుడు కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తనదైన శైలితో పుష్ప రాజ్ ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించాడు. తాజాగా, ఐకాన్ స్టార్, అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌ను, సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. దర్శకుడిగా మొదటి సినిమాతోనే తనదైన ముద్రను వేసి భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

సందీప్ రెడ్డి వంగ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను టీ సిరీస్ ప్రొడక్షన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించనున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమా అల్లు అర్జున్ చేసుంటే ఇంపాక్ట్ గట్టిగా ఉండేదని దర్శకుడు సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చాడు. ఈసారి అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్న సందీప్ ఐకాన్ స్టార్‌ను ఏ రేంజ్‌లో చూపించనున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఇవి కూడా చదవండి : స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేసి.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీలీల

Advertisement

Next Story